Wednesday, November 14, 2007
Nayagara
*********
ఇదేమి అద్భుతం !
ఆ శిల అంచుల మీద
నీటిని ఆరవేసినదెవరు?
******
అందరూ చెప్పే సామెత
అబద్ధం
ఇక్కడ నిప్పు లెకుండానే
పొగ వస్తుందే!
*******
అదేమిటి
ఆత్మహత్య చెసుకునే నీళ్లకి
అంత ఆనందమా?
*******
ఇక్కడ నీళ్లు
ముత్యాల కోసం వెతకాలని
దూకుతున్నాయా????
Friday, November 09, 2007
Subscribe to:
Posts (Atom)